- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, విద్యా సంవత్సరం 2025 -2026 లో విద్యార్థులకు తరగతుల ప్రారంభమైనవని కళాశాల ప్రిన్సిపల్ కే.అశోక్ తెలిపారు. విద్యార్థులు క్రమం తప్పకుండా తరగతులకు హాజరుకావాలని కోరారు. కనీసం 75% శాతం హాజరు ఉండేలా చూసుకోవాలని తెలిపారు. విశేష అనుభవం ఉన్న అధ్యాపకుల సేవలు వినియోగించుకోవాలని అన్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాయిలు మాట్లాడుతూ.. జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతారావు సహకారంతో కాలేజీకి ముందుకు తీసుకుపోతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పాండురంగ, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -