Friday, September 5, 2025
E-PAPER
spot_img
Homeసినిమా'మదరాసి' క్రేజీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌

‘మదరాసి’ క్రేజీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌

- Advertisement -

”మదరాసి’ కథ చాలా కొత్తగా ఉంటుంది. హై వోల్టేజ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉన్నాయి. ఎమోషన్‌, యాక్షన్‌ కాన్వాస్‌ పరంగా బిగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చే సినిమా ఇది’ అని కథానాయకుడు శివకార్తికేయన్‌ అన్నారు. ఆయన నటించిన కొత్త చిత్రం ‘మదరాసి’. ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్‌ నిర్మించిన ఈ చిత్రం నేడు (శుక్రవారం) థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరో శివకార్తికేయన్‌ మీడియాతో ముచ్చటించారు. చిరంజీవి, మహేష్‌ బాబు లాంటి పెద్ద స్టార్స్‌ని డైరెక్ట్‌ చేసిన మురుగదాస్‌ చాలా కూల్‌గా ఉంటారు. అలాగే మంచి క్లారిటీతో ఉంటారు. ఆయనతో కలిసి వర్క్‌ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో లవ్‌, యాక్షన్‌ రెండు పిల్లర్స్‌. అందులో లవ్‌ పోర్షన్‌ అద్భుతంగా రావడానికి కారణం రుక్మిణి. ఈ సినిమాలో తన పాత్ర చాలా కీలకం. కథకి ఎమోషన్‌ యాడ్‌ చేసే రోల్‌ అది. తన నటన సినిమాకి బిగ్‌ ఎసెట్‌. అలాగే ఇందులో యాక్షన్‌ బ్లాక్స్‌ ఆడియన్స్‌ని మెస్మరైజ్‌ చేస్తాయి. యాక్షన్‌లో మ్యాడ్‌ నెస్‌ ఉంటుంది. బిగ్‌ స్క్రీన్‌ పై సెలబ్రేట్‌ చేసుకునేలా ఉండే సినిమా ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదొక క్రేజీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. అనిరుధ్‌, నేను బెస్ట్‌ ఫ్రెండ్స్‌. మా కాంబినేషన్‌లో వచ్చిన అన్ని సినిమాలు మ్యూజికల్‌గా హిట్‌ అయ్యాయి. ఈ సినిమా కూడా మ్యూజికల్‌గా అద్భుతంగా వచ్చింది. రీరికార్డింగ్‌ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పటివరకు నా సినిమాలకు తెలుగునాట మంచి సపోర్ట్‌ ఇచ్చారు. మంచి గుర్తింపు ఇచ్చారు. అద్భుతమైన కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమాని కూడా అలానే ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad