Saturday, February 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి వైభవోత్సవం

రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి వైభవోత్సవం

- Advertisement -

నవతెలంగాణ – ఆత్మకూరు
వందల సంవత్సరాల పురాతన కోట గుళ్లతో కూడిన ఆత్మకూరు మండలం కటాక్షపూర్ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం మహా శివరాత్రి మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. గతేడాదికంటే ఈసారి రెండు కోటల గుళ్లు ముస్తాబు చేశారు. భక్తుల సౌకర్యాలకు పూర్తి ప్రాధాన్యత ఇచ్చారు. స్థానిక సర్పంచ్ షబానా గఫూర్ నేతృత్వంలో పాలకవర్గం, దేవాలయ నూతన నిర్వహణ సభ్యులు కలిసి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

తాగునీరు, ప్రకాశవంతమైన లైటింగ్, విస్తృత పార్కింగ్ స్థలాలు, ఇతర సౌకర్యాలతో భక్తులకు అనుకూలంగా ఉంటాయి. హౌజుబుజుర్గు, మమ్మద్ గౌస్, రేలకుంట, నందిగామ, నేరేడుపల్లి, సింగారం అప్పయ్యపల్లి గ్రామాల నుంచి వేలాది భక్తులు ఆ మహా దేవుని దర్శనానికి కొస్తారు. ఈ ఉత్సవం ఆధ్యాత్మిక ఉల్లాసంతో పాటు స్థానిక ఐక్యతను పెంచుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -