రోడ్డు మరమ్మతులకు నేడు ఎమ్మెల్యే శంకుస్థాపన
మూడు కోట్లతో రోడ్డు నిర్మాణ పనులు
నవతెలంగాణ-పాలకుర్తి
మొంథా తుఫానుతో కురిసిన భారీ వర్షానికి మండలంలోని వల్మీడీ, ముత్తారం గ్రామాల మధ్య రోడ్డు భారీ వరదలకు కొట్టుకు పోవడంతో బ్రిడ్జి నిర్మాణంతోపాటు రోడ్డు మరమ్మతులకు మహర్దశ కలిగింది. ధ్వంసమైన రోడ్లకు ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి నేడు బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా పి ఆర్ డిఈ రామలింగేశ్వర చారి మాట్లాడుతూ భారీ వర్షానికి వల్మిడి, ముత్తారం గ్రామాల మధ్య బ్రిడ్జితోపాటు రోడ్డు ధ్వంసం కావడంతో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి 3 కోట్లతో బ్రిడ్జి తో పాటు రోడ్డు నిర్మాణ పనులకు సి ఆర్ ఆర్ నిదులను మంజూరు చేశారని తెలిపారు. భారీ వర్షాలకు ధ్వంసమైన రోడ్లను మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వల్మిడి, ముత్తారం గ్రామాల మధ్య రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో వాహనదారులకు, ప్రయాణికులకు అంతరాయం కలగడంతో పాటు రాకపోకలకు ఇబ్బంది కలిగిందని తెలిపారు. రోడ్డు తాత్కాలిక మరమ్మత చర్యలు చేపట్టి రాకపోకలను పునరుద్ధరిస్తామని, ధ్వంసమైన రోడ్డు నిర్మాణ పనులను సరిత గతిన పూర్తి చేస్తామని తెలిపారు.
ధ్వంసమైన రోడ్లకు మహార్దశ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



