మల్లంపల్లి ఉన్నత పాఠశాలకు కుర్చీల బహూకరణ
నవతెలంగాణ-పాలకుర్తి
ప్రభుత్వ పాఠశాలలకు మహాత్మా హెల్పింగ్ హాండ్స్ చేయూతను అందిస్తుందని మల్లంపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె అనిత తెలిపారు. గురువారం మండలంలోని మల్లంపల్లి ఉన్నత పాఠశాలకు మహాత్మ హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో మూడువేల విలువచేసే కుర్చీలను బహుకరించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు అనిత మాట్లాడుతూ పాఠశాలలో ఉన్న కంప్యూటర్ల కు కుర్చీలు అవసరం ఉన్నాయని మహాత్మా హెల్పింగ్ హాండ్స్ వ్యవస్థాపకులు గంట రవీందర్ దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. స్పందించిన గంటా రవీందర్ పాఠశాలకు కుర్చీలను బహుకరించాలని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలోని చదివే విద్యార్థిని, విద్యార్థులను ప్రోత్సహించేందుకు మహాత్మ హెల్పింగ్ హ్యాండ్ ఎంతో కృషి చేస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందనే నమ్మకాన్ని మహాత్మ హెల్పింగ్ హాండ్స్ ప్రజలకు కల్పిస్తుందని తెలిపారు. దాతల స్ఫూర్తితో విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధనను అందిస్తూ పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలను సాధించేందుకు కృషి చేస్తామని అన్నారు. పాఠశాలకు కుర్చీలను బహుకరించిన గంట రవీందర్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ప్రవీణ్,వెంకటేశ్వర్లు, శ్రీకాంత్ ,కవిత ,ఓంకార చారి, రవికిరణ్, లత, గ్రామస్తులు గిరగాని సుధాకర్, మార్త శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలకు మహాత్మా హెల్పింగ్ హాండ్స్ చేయూత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES