Thursday, October 30, 2025
E-PAPER
Homeసినిమామహేష్‌బాబు మేనకోడలు జాన్వీ హీరోయిన్‌గా ఎంట్రీ

మహేష్‌బాబు మేనకోడలు జాన్వీ హీరోయిన్‌గా ఎంట్రీ

- Advertisement -

సూపర్‌స్టార్‌ కృష్ణ కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమకు మరో కొత్త కథానాయిక పరిచయం కానుంది. కృష్ణ మనవరాలు, మహేష్‌బాబు కోడలు, మంజుల కుమార్తె జాన్వీ హీరోయిన్‌గా త్వరలోనే వెండితెరపై మెరవబోతున్నారు. ఈ విషయాన్ని బుధవారం అధికారికంగా ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం ప్రత్యక్షమైన జాన్వీ ఫొటోలు సోషల్‌ మీడియాలో అద్భుతమైన స్పందన తెచ్చుకున్నాయి. ఆ ఫొటోలను చూసి ఇండస్ట్రీ వర్గాలు సైతం తెరపై కనిపించే అత్యంత అందమైన అమ్మాయిగా అభివర్ణించడం విశేషం. పదేళ్ల వయసులోనే తల్లి మంజుల ఘట్టమనేని దర్శకత్వం వహించిన ‘మనసుకు నచ్చింది’ సినిమాలో కెమెరా ముందుకొచ్చిన జాన్వి తన సహజమైన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచింది.

అప్పటి నుంచి నటన, నృత్యం నేర్చుకుంటూ తన ప్రతిభను నైపుణ్యంగా మార్చుకుంది. తల్లి మంజులకి ఇది ప్రత్యేకమైన క్షణం. కొన్నేళ్ల క్రితం ఆమెకూ నటనపై కలలు ఉండేవి, కానీ ఆ కాలం మహిళలకు అంత అనుకూలంగా ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం ప్రపంచం సిద్ధంగా ఉంది. ప్రేమతో ఉంది, ఎదురు చూస్తోంది. ‘నన్ను అడ్డుకున్న వారే ఇప్పుడు జాన్వి కోసం ప్రార్థిస్తున్నారు. జాన్వి చిరునవ్వు నా ప్రార్థనలకు సమాధానం’ అని మంజుల అన్నారు. అడ్డంకుల నుంచి ఆమోదం వైపు, నిశ్శబ్దం నుంచి గౌరవం వైపు. ‘మేము మారాం, మేము అర్థం చేసుకున్నాం, ఇప్పుడు నీకు ఆశీర్వాదం ఇస్తున్నాం’ అని అంటున్నారు ఘట్టమనేని అభిమానులు, ప్రేక్షకులు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -