సునామీ హెచ్చరికలు జారీ
టోక్యో : జపాన్ తీరంలో ఆదివారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. ఈ భారీ భూకంపం తరువాత కూడా వరస ప్రకంపనలు తీరాన్ని కుదిపేశాయి. దీంతో సునామీ హెచ్చరికల్ని జారీ చేశారు. అయితే ఇప్పటి వరకూ ఎలాంటి ప్రమాదం గురించి నివేదికలు రాలేదు. జపాన్ వాతావరణ సంస్థ సమాచారం ప్రకారం ఆదివారం సాయంత్రం 5:12 గంటల ప్రాంతంలో ఉత్తర జపాన్‌లోని ఇవాటే ప్రిఫెక్చర్ తీరానికి సుమారు 70 కిలీమీటర్ల దూరంలో సముద్ర ఉపరితలం నుంచి 10 కిలోమీటర్లు లోతున ఈ భూకంపం సంభవించింది. దీని తీవ్రతను రిక్టార్‌పై 6.7గా గుర్తించారు. తరువాత కూడా వరుస ప్రకంపనలు వచ్చాయి. దీంతో జపాన్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ఎన్‌హెచ్‌కె సునామీ హెచ్చరికలను జారీ చేసింది. జపాన్ ఉత్తర తీరంలో ఒక మీటర్ ఎత్తు వరకూ సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. సునామీ ప్రమాదం ఉన్నందున తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఇవాటే ప్రిఫెక్చర్‌లోని ఒఫునాటో నగరం, ఒమినాటో పోర్టు వద్ద దాదాపు 10 సెంటీమీటర్ల సునామీ గుర్తించబడిందని ఎన్‌హెచ్‌కె తెలిపింది.
జపాన్ తీరంలో భారీ భూకంపం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



