- Advertisement -
నవతెలంగాణ దుండిగల్: మేడ్చల్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దుండిగల్ పరిధి బహదూర్‌పల్లి గ్రీన్‌హిల్స్ కాలనీలోని డెకరేషన్ స్క్రాప్ గోదాంలో మంటలు చెలరేగాయి. అగ్నికీలలు వేగంగా వ్యాపించడంతో పక్కనే ఉన్న అపార్ట్మెంట్లో పార్క్ చేసిన వాహనాలకు కూడా మంటలు అంటుకున్నాయి.
ఈ అగ్నిప్రమాదం కారణంగా కాలనీలో దట్టమైన పొగ వ్యాపించింది. ఎగిసిపడుతున్న మంటలు, కమ్మేసిన పొగతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేసేందుకు యత్నిస్తున్నారు. మరోవైపు జీడిమెట్ల పారిశ్రామికవాడలోనూ భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
- Advertisement -



