Monday, December 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ అభ్యర్థి ఉషా-సంతోష్ మేస్త్రీని అత్యధిక మెజారిటీతో గెలిపించండి: ఎమ్మెల్యే తోట

కాంగ్రెస్ అభ్యర్థి ఉషా-సంతోష్ మేస్త్రీని అత్యధిక మెజారిటీతో గెలిపించండి: ఎమ్మెల్యే తోట

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
జుక్కల్ ఎమ్మెల్యేగా మూడుసార్లు ప్రజలు గెలిపిస్తే మద్నూర్ మండల కేంద్రానికి అభివృద్ధి చేయనోడివి సర్పంచ్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం ప్రజలకు మభ్య పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడే హక్కు నీకు లేదు అంటూ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండేను విమర్శించారు. మద్నూర్ మండల కేంద్రం అభివృద్ధి చెందాలంటే అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఉషా సంతోష్ మేస్త్రిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ఈ సందర్బంగా కోరారు. మద్నూర్ మండల కేంద్రాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దటానికి కృషి చేస్తానని, నిరుపేద ప్రజలకు అన్ని రకాలుగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు.

ప్రతిపక్ష అభ్యర్థులు గెలిస్తే అభివృద్ధి చేయలేరని, ఎలాంటి అభివృద్ధి కావాలన్నా ఎమ్మెల్యేగా తానే చేయవలసి ఉంటుందని, అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని గ్రామ ప్రజలను కోరారు. ఉషా సంతోష్ మేస్త్రిని ఎమ్మెల్యే చెల్లెగా భావిస్తూ.. ఆమె గెలుపు కాదని నా గెలుపుగా ప్రజలు గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామానికి ఏది కావాలన్నా అన్ని రకాల అభివృద్ధి పరుస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్, మండల పార్టీ అధ్యక్షులు ధరాస్ సాయిలు, ఎమ్మెల్యేకు సన్నిథుడైన సాయి పటేల్, మాజీ ఎంపీపీ ప్రవీణ్ కుమార్, మాజీ ఎంపిటిసి కర్రెవార్ రాములు, కాంగ్రెస్ నాయకులు బండి లక్ష్మణ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండి గోపి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఉషా సంతోష్ మేస్త్రి, వందలాదిగా తరలివచ్చిన గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -