మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో గ్రామాలు అభివృద్ధి చేస్తాం..
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్షిన అభ్యర్థులైన తాడిచెర్లలో బండి స్వామి, మల్లారంలో మేకల రాజయ్య, పెద్దతూండ్లలో బండారి నర్సింగరావు, అడ్వాలపల్లిలో బానోతు సమ్మక్క కిషన్ నాయక్, కొయ్యుర్ లో కొండ రాజమ్మ, వళ్లెంకుంటలో బొమ్మ రజిత రమేష్ రెడ్డి, కొండంపేటలో బెల్లంకొండ జ్యోష్ణ సరిన్ రావు, ఎడ్లపల్లిలో జంగిడి శ్రీనివాస్, రుద్రారంలో చంద్రగిరి సంపత్, ఇప్పలపల్లిలో కోడారి చినమల్లయ్య, మల్లంపల్లిలో జాడి రాములు, ఆన్ సాన్ పల్లిలో గుగులోతు మంజుల జగన్ నాయక్, నాచారంలో ఒర్రె వనమ్మ రాజైలు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సహకారంతో గ్రామాలను అన్నివిధాలా అభివృద్ధి చేస్తూ,ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా చూస్తామన్నారు.
అలాగే గ్రామాల్లో పేరుకుపోయిన ప్రతి సమస్యను పరిస్కారం చేస్తామన్నారు. ఇప్పటికే చిన్నతూండ్ల, దుబ్బపేట కాంగ్రెస్ అభ్యర్థులు గడ్డం క్రాoతి, భూక్య రవిందర్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా తెలిపారు. రాష్ట్ర మంత్రి శ్రీదర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాలతో సోమవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరుపున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి నిధులు, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వ పథకాలని అందిస్తోందన్నారు. బీఆర్ఎస్, బిజెపి, స్వతంత్ర అభ్యర్థులకు ఓటు వేస్తే వృధావుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



