Monday, May 12, 2025
Homeతెలంగాణ రౌండప్సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభలు.. విజయ వంతం చేయండి

సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభలు.. విజయ వంతం చేయండి

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
భారత మార్కిస్టు కమ్యూనిస్ట్ పార్టీ(ఎంసిపిఐ) రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలని యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు,ఎంసిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు కా.అక్కల బాపు యాదవ్ పిలుపునిచ్చారు.ఆదివారం మండలంలోని ఇప్పలపల్లి గ్రామంలో ఎంసిపిఐ తెలంగాణ రాష్ట్ర ప్రధమ మహాసభల కరపత్రం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా బాపు మాట్లాడారు దేశంలో ఒక వైపు నిరుద్యోగం పెరుగుతుంటే,మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలు మూత పడుతున్నాయని పేర్కొన్నారు.ఇంకొక వైపు మతం పేరిట ఉగ్రవాదం పేరుగుతు అరాచకాలు చేస్తున్నారని ఆరోపించారు.అందులో భాగంగానే పహల్గంలో 26 మంది పర్యాటకులను ఉగ్ర వాదులు చంపడం జరిగిందన్నారు.ప్రస్తుతం పాకిస్థాన్ కు మన దేశంతో యుద్ధం కొనసాగుతుందని,ఉగ్ర వాదంను పెంచే ఏ మతతత్వ వాధనైన ఎంసిపిఐ,యువైఏప్ఐ లు గట్టిగా వ్యతిరేకి స్థాయన్నారు. అట్లాగే మతతత్వ ఉన్మాదం ను రూపుమాపడానికి అందరూ కృషి చేయాలన్నారు.కార్మిక హక్కుల కోసం మే 20 సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలన్నారు.వరంగల్ లో మే 26,27,28 రోజుల్లో జరిగే భారత మార్క్సిస్టు కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర  ప్రధమ మహాసభలకు అందరూ సహకరించి విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రములో ఎడ్ల రామయ్య,గొట్టం ఎల్లయ్య, గుంటి బాపు,దయ్యం పోచయ్య, జంగ సత్య నారాయణ, తోట రాజయ్య,ఎండీ సయ్యద్,అంగో శిలా నాయక్, గుంటీ నాగరాజు,టేకు ఎల్లయ్య, గుంతి లక్ష్మయ్య, చేద నారాయణ,గొట్టం లక్ష్మి నారాయణ, కాలేని రాజమణి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -