ఐద్వా జిల్లా కార్యదర్శి ఎ. నర్మద
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోన ఐద్వా ఆఫీస్ నందు 14, వ జాతీయ మహాసభలు జయప్రదం చేసేందుకు ఐద్వా ఆధ్వర్యంలో సమావేశం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 14 వ జాతీయ మహాసభ ల కరపత్రాలు విడుదల చేశారు. ఈ సమావేశం లో ఐద్వా జిల్లా కార్యదర్శి ఎ. నర్మద మాట్లాడుతూ.. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా 14వ జాతీయ మహాసభలు 2026 జనవరి 25-28, తేదీల్లో హైదరాబాద్ లో జరగనున్నాయని తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా జరుగుతున్న ఈ మహాసభలకు రాష్ట్ర రాజధాని హైదరాబాదు వేదిక కానుందని తెలిపారు.
నాలుగు రోజులపాటు జరిగే ఈ మహాసభల్లో దేశవ్యాపితంగా మహిళలు ఎదుర్కొనే ప్రధానమైన సమస్యలు చర్చించి, రూపొందించబోయే భవిష్యత్ కార్యాచరణ మహిళా ఉద్యమాలకు దిశనిర్దేశం చేయనున్నదని అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా నుండి మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా నాయకులు పద్మ , ఐద్వా నాయకులు కాంతమ్మ, సునీతా, రాణి, సంగీత, ప్రియాంక, కమల, లలిత, తదితరులు పాల్గొన్నారు.