సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు
మహాసభలపై డిఎంహెచ్ఓ కు వినతి
నవతెలంగాణ – వనపర్తి : సీఐటీయూ వనపర్తి జిల్లా 4వ మహాసభలు పెబ్బేరు పట్టణంలో జులై 14 ,15 తేదీలలో జరగబోతున్నాయని, ఈ మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు పిలుపునిచ్చారు. వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఆశా వర్కర్స్ సమావేశం శుక్రవారం నిర్వహించారు. జూలై 14న జరిగే బహిరంగ సభకు ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మున్సిపల్ కార్మికులు, గ్రామపంచాయతీ కార్మికులు, ఐకెపి వివో ఏలు, మెప్మా ఆర్పీలు, హమాలీలు, భవన నిర్మాణ కార్మికులు, ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు, ఆర్టీసీ కార్మికులు, విద్యుత్తు ఉద్యోగులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పుట్ట ఆంజనేయులు పిలుపునిచ్చారు.
సీఐటీయూ జిల్లా 4వ మహాసభల బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. జయలక్ష్మి తదితరులు పాల్గొంటారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలు నిర్వహిస్తున్న సిఐటియు జిల్లా మహాసభలలో అన్ని రంగాల ఉద్యోగులు, కార్మికుల సమస్యలపై చర్చించి గత మూడు సంవత్సరాల్లో జరిగిన ఉద్యమాలను సమీక్షించుకొని, భవిష్యత్తు కర్తవ్యాలను ఈ మహాసభల్లో రూపొందించుకోవడం జరుగుతుందన్నారు.
కార్మికుల సమస్యలపై తీర్మానాలు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం నూతన జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. కావున ఈ బహిరంగ సభకు అన్ని రంగాల కార్మికులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నామన్నారు. అనంతరం డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ శ్రీనివాసులుకు జులై 14న జరుగు బహిరంగ సభకు ఆశా వర్కర్లు హాజరయ్యేందుకు అనుమతించాలని డి ఎం అండ్ హెచ్ ఓ కు వితపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ సానుకూలంగా స్పందించి అనుమతించడంతో వారికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సమావేశంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె. సునీత , సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి గంధం మదన్, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు నందిమల్ల రాములు, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు బాల కిష్టమ్మ, పార్వతమ్మ, భాగ్యమ్మ, అనిత, శ్యామల, మహేశ్వరి, వినీల తదితరులు పాల్గొన్నారు.