Monday, December 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీపీఐ(ఎం), కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి

సీపీఐ(ఎం), కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి

- Advertisement -

ఎగ్గిడి శ్రీశైలం ఓబిసి రాష్ట్ర కమిటీ నెంబర్
నవతెలంగాణ – ఆలేరు

మూడో విడతలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల భాగంగా మోటకొండూరులో డిసెంబర్ 17న జరిగే ఎన్నికల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి జయమ్మ శ్రీనివాసులు గెలిపించాలని ఓబిసి రాష్ట్ర కమిటీ మెంబర్ ఎగ్గిడి శ్రీశైలం ప్రజలను కోరారు. సోమవారం మోటకొండూరు మండలం ఇన్చార్జిగా గ్రామాలను పర్యటించి కాంగ్రెస్ అభ్యర్థుల కోసం ప్రచార నిర్వహించినట్లు చెప్పారు. మోట కొండూరు  పట్టణంలో ప్రచార భాగంగా ప్రతివార్డు తిరిగి ఇంటింటా ప్రచారం చేయడం జరిగిందన్నారు. సీపీఐ(ఎం), కాంగ్రెస్, బిజెపి బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమండ జయమ్మ శ్రీనివాస్ బ్యాటు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలన్నారు.

ప్రతి వార్డు సభ్యులను మిత్రపక్షాలు బలపరిచిన అభ్యర్థి గుర్తులపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని ప్రతి ఇంటికి ప్రచారం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి భూమండ్ల జయమ్మ శ్రీనివాస్, ఆలేరు మండల సీపీఐ నాయకులు పేరపు రాములు, ప్రజా నాట్య మండలి కళాకారు లు జన్నె వెన్నెల, కంకల ఎలేందర్, అనంతుల తిరుమల్ రెడ్డి, భూమండ్ల ఇస్తారి, కూళ్ల సత్తయ్య, కూళ్ల సిద్ధులు, కొన్నే మల్లేష్, జట్ట సిద్దులు తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -