Monday, July 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేపు ఛలో గన్ పార్క్ విజయవంతం చేయండి

రేపు ఛలో గన్ పార్క్ విజయవంతం చేయండి

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఈనెల 22న మంగళవారం ఛలో గన్ పార్క్ కార్యక్రమం చేపడుతున్నట్లు మద్నూర్  మండల తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు తూమ్ హన్మండ్లు తెలిపారు. సోమవారం మద్నూర్ మండల కేంద్రంలో ఆయన ఉద్యమకారులతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారులకు  ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇంటిస్థలం, నెలవారి పెన్షన్, ప్రభుత్వ పథకాల్లో 20శాతం రిజర్వేషన్, ఉచిత బస్ పాస్, హెల్త్ కార్డు, ఉద్యమకారుల కొరకు హైదరాబాద్ లో సంక్షేమ బోర్డు ఏర్పాటు తదితర హమీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఛలో గన్ పార్క్ చేపడుతున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో ఉద్యమకారులు మాలి శివరాం, వట్నాల్ గంగారం, పాకల విఠల్, పైడాకుల్ అంజయ్య, రాచూర్ సుభాష్, మొగులాజీ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -