సీఐటీయూ జెండా ఆవిష్కరణలో సీనియర్ నేత పి.రాజారావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విశాఖపట్నంలో డిసెంబర్ 31 నుంచి జనవరి నాలుగో తేదీ వరకు జరిగే సీఐటీయూ అఖిల భారత 18వ మహాసభలను జయప్రదం చేయాలని ఆ యూనియన్ సీనియర్ నేత పి.రాజారావు పిలుపునిచ్చారు. సీఐటీయూ ఫ్లాగ్‌డే ను పురస్కరించుకుని సోమవారం హైదరాబాద్‌లోని ఆ యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో సీఐటీయూ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భం గా సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్‌ల రద్దు, కనీస వేతనాల అమలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై అఖిల భారత మహాసభలో చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామన్నారు. అఖిల భారత మహాసభలను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య, ఎస్వీ. రమ, రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, రాష్ట్ర కార్యదర్శులు జె. వెంకటేష్, కూరపాటి రమేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న పాల్గొన్నారు.
సీఐటీయూ అఖిలభారత మహాసభలను జయప్రదం చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



