Thursday, November 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్కే లతీఫ్ సంతాప సభను జయప్రదం చేయండి

ఎస్కే లతీఫ్ సంతాప సభను జయప్రదం చేయండి

- Advertisement -

ఎంఏ ఇక్బాల్ఆవాజ్ జిల్లా అధ్యక్షులు
నవతెలంగాణ – ఆలేరు రూరల్

సమాజంలో మతసామరస్యం కోసం చివరిదాకా పోరాడిన మహోన్నత వ్యక్తి ఎస్ కె లతీఫ్ సంతాప సభను జయప్రదం చేయాలని ఆవాజ్ కమిటీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు ఎంఏ ఎగ్బాల్ కోరారు. ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం రోజున సమావేశంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఈనెల 25న యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం సుందరయ్య భవనంలో దివంగత నాయకులు ఆవాజ్ రాష్ట్ర నాయకులు, ముస్లిం సంచారజాతుల సంక్షేమ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్కే లతీఫ్  సంతాప సభ ఆవాజ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా నిరంతరం మైనార్టీల హక్కుల కోసం, సమాజంలో మతసామరస్యం కోసం తను జీవించినంత కాలం పాటుపడిన వ్యక్తి ఎస్ కె లతీఫ్ ని స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు.ఈ సంతాప సభకు లౌకిక, ప్రజాతంత్ర వాదులు, ప్రజా సంఘాల నాయకులు ఆవాజ్  నాయకత్వం అధిక సంఖ్యలో హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎండి అజ్మత్ ఎండి ఖలీల్ ఎండి మతిన్ ఎండి బద్రు ఎండి అఖిల్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -