సిపిఐ జిల్లా కార్యదర్శి విజయ రాములు
నవతెలంగాణ- వనపర్తి
జిల్లాలో సిపిఐ బస్ జాతను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి విజయ రాములు కార్యకర్తలను కోరారు. గోపాల్పేట, రేవల్లి మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం గోపాల్పేట మండల కేంద్రంలో నిర్వహించారు. సమావేశానికి సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు పాల్గొని మాట్లాడుతూ .. ఖమ్మంలో జరుగు సిపిఐ 100 వసంతాల ముగింపు సభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈనెల గద్వాల జిల్లా కేంద్రం లొ ప్రారంభమైన బస్సుజాత ఈనెల 15న మధ్యాహ్నం 12 గంటలకు వనపర్తి జిల్లా కేంద్రానికి చేరుకుంటుందని ఆ బస్సు జాత వనపర్తి జిల్లాలో పెబ్బేరు, వనపర్తి, కొత్తకోట, మదనాపురం, ఆత్మకూరు, అమరచింత తదితర మండలంలో సిపిఐ వందేళ్ళ పోరాట చరిత్రను ప్రచారం చేస్తూ అనంతరం నారాయణపేట జిల్లాకు వెళుతుందన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి జిల్లాలోని అన్ని గ్రామ శాఖల నుండి నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జాతను విజయవంతం చేయవలసిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు జె చంద్రయ్య వనపర్తి నియోజకవర్గం కార్యదర్శి రమేష్ మండల కార్యదర్శిలు మంగలి శాంతయ్య, యూసుఫ్ నాయకులు తిరుపతయ్య, అంజి, తాహిర్, శేఖర్, కోటయ్య, బుచ్చన్న, రవి తదితరులు పాల్గొన్నారు.



