Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్గొల్ల కురుమల సదస్సును విజయవంతం చేయండి 

గొల్ల కురుమల సదస్సును విజయవంతం చేయండి 

- Advertisement -

టీపీసీసీ వర్కింగ్ చైర్మన్, ఓబిసి జిల్లా అధ్యక్షుడు మేకల వీరన్న 
నవతెలంగాణ – నెల్లికుదురు 

జిల్లా కేంద్రంలోని సెప్టెంబర్ ఐదవ తేదీన జరగబోయే గొల్ల కురుమల యాదవ సదస్సును ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని టిపిసిసి పార్కింగ్ ప్రెసిడెంట్ మేకల వీరన్న మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్లు ఓ బి సి సెల్ మండల అధ్యక్షుడు ఆకుల నరసయ్య అన్నారు. మండల కేంద్రంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో గొల్ల కురుమల సదస్సు ల పోస్టర్ను ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 42% రిజర్వేషన్ అమలు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు బీసీ కులాల ఐక్యత కోసం దానికి గొల్ల కురుమల  సహకారం గురించి ప్రొఫెసర్ కంచ ఐలయ్య ఏ సదస్సుకో హాజరవుతున్నారని అన్నారు.

ఈ సదస్సులో ప్రతి ఒక్క గొల్ల కురుమ సభ్యుడు పాల్గొని విజయవంతం చేయాలని, మన హక్కులను మనం సాధించుకునేందుకు ఐక్యమత్యంగా ఉండి ఉద్యమించాల్సిన సమయం ఉందని అన్నారు. ఈ సందర్భంగా బీసీ కులాల మిత్రులను ముఖ్యంగా గొల్ల కురుమ సభ్యులందరూ కూడా  ఐదో తారీకు జరిగే గొల్ల కురుమ సదస్సు యశోద గార్డెన్ మహబూబాద్ ఐదో తారీకు సెప్టెంబర్ 5 ఆ తేదీన నిర్వహిస్తున్నారు కావున ప్రతి ఒక్క బీసీ బిడ్డ  పాల్గొని ఈ సభను విజయవంతo చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొనబోయే వారు రాష్ట్ర మంత్రులు సీతక్క , తోపాటు ఎంపీలు ఎమ్మెల్యేలు పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఓబీసీ సెల్ మండల అధ్యక్షుడు ఆకల నాగన్న ఆకల కొమురెల్లి మంచాల అశోక్ మంచాల సందీప్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad