Tuesday, July 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జూలై 9 సమ్మెను జయప్రదం చేయండి

జూలై 9 సమ్మెను జయప్రదం చేయండి

- Advertisement -

నాలుగు లేబర్ కోడ్ ల రద్దు చేయాలి
ప్రీమియర్ గేట్ మీటింగ్ లో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
: కేంద్ర బిజెపి ప్రభుత్వ విధానాలకు నిరసనగా జూలై 09 న జరిగే దేశవ్యాపిత  సార్వత్రిక సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్ కార్మికులకు పిలుపునిచ్చారు. మంగళవారం, పెద్దకందుకూరు ప్రీమియర్ ఎక్స్ ప్లాసివ్ లిమిటెడ్ పరిశ్రమలో సిఐటియు వర్కింగ్ ప్రెసిడెంట్ కల్లూరి మల్లేశం అధ్యక్షతన గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ గేట్ మీటింగ్ లో సిఐటియు, టి ఆర్ ఎస్ కె వి, ఐ ఎన్ టి యు సి, హెచ్ ఎం ఎస్, టి ఎన్ టి యు సి  యూనియన్ ల నుండి కార్మికులు పాల్గొన్న సభలో భూపాల్ పాల్గొని మాట్లాడుతూ స్వాతంత్ర్యానికి పూర్వం నుండి బ్రిటిష్ వారిపై సైతం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లను కార్పొరేట్ ల ప్రయోజనం కోసం తీసుకువచ్చిందని విమర్శించారు.

ఈ లేబర్ కోడ్ ల వల్ల కార్మికులు సమ్మె చేసే హక్కును సైతం ప్రశ్నార్ధకం చేశారని , యూనియన్ ల ఏర్పాటు యాజమాన్యాల కనుసన్నల్లో జరిగే విధానం తీసుకువచ్చారని విమర్శించారు. యూనియన్ గుర్తింపు ఎన్నికలలో 51 శాతం వస్తే తప్ప గుర్తింపు ఎన్నికలు లేకుండా చేశారని విమర్శించారు. నేడు పరిశ్రమలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని లేబర్ కోడ్ లు అమలులోకి వస్తే మరింత పెరుగుతాయని ఇప్పటికే నామమాత్రంగా ఉన్న ఫ్యాక్టరీ ల ఇన్స్పెక్టర్ ల తనికీలు భవిష్యత్  లో లేకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు బిఎంఎస్ యూనియన్ కార్మికులను విడదీస్తూ కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్ లకు మద్దతుగా ఉంటూ కార్మిక ఐక్యతకు విఘాతం కలిగిస్తున్నారని విమర్శించారు. రేపు జరిగే సమ్మె లో కార్మికులు యూనియన్ లకు అతీతంగా సమ్మె లో పాల్గొనాలి పిలుపునిచ్చారు.

ఈ గేట్ మీటింగ్ కు సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం అధ్యక్షత వహించగా టి ఆర్ ఎస్ కె వి యూనియన్ నాయకులు బర్మ సత్తయ్య, ఐ ఎన్ టి యు సి జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి, హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ సంపత్, టి ఎన్ టి యు సి రాష్ట్ర నాయకులు రేగు బాలనర్సింహ , హెచ్ ఎం ఎస్ నాయకులు సత్యనారాయణ , శ్రీనివాస్, సి ఐ టి యు జనరల్ సెక్రటరీ చెక్క రమేష్ , జిల్లా సహాయ కార్యదర్శి సుబ్బురు సత్యనారాయణ , జిల్లా కమిటి సభ్యులు పుప్పాల గణేష్ , టి ఆర్ ఎస్ కె వి బాలరాజు ఐ ఎన్ టి యు సి నాయకులు పెంటయ్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ జమ్ము రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -