Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

- Advertisement -

సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మాయ కృష్ణ
నవతెలంగాణ – భువనగిరి
: జులై 9న కార్మిక సంఘాల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని జిల్లా సీఐటీయూ సహాయ కార్యదర్శి మాయ కృష్ణ  విజ్ఞాప్తి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు లేబర్ ఇన్సూరెన్స్ ,లేబర్ కార్డు లు ,ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయాలని మాయ కృష్ణ అన్నారు. మే 20న జరగవలసిన సమ్మెను పాకిస్తాన్ భారతదేశం యుద్ధ వాతావరణ సందర్భంగా వాయిదా వేసుకుని జూలై 9న కేంద్ర ప్రభుత్వం బిజెపి నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగాడుతూ రైతు, వ్యవసాయం, కార్మిక సంఘాల అన్ని కార్మిక సంఘాలతో జులై 9న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని భవన నిర్మాణ కార్మికుల తో సమ్మె విశిష్టతను తెలిపారు. 

బిజెపి రెండవసారి ఎన్నికలలో నరేంద్ర మోడీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఎన్నికలలో మాట ఇచ్చి ఇంతవరకు ఉద్యోగాల భర్తీ చేయక అంబానీ ఆదాని లాంటి వారికి కార్పోరేట్ శక్తులకు విమానాలు,పోస్టులు, ఎల్ఐసి, రైల్వే ప్రవేట్ వ్యక్తులకు అప్పజెప్తూ యువతకు ఉద్యోగాలు చేసుకునే పరిస్థితిలో లేక డిగ్రీలు, టెక్నాలజీ, చదివిన యువత భవన నిర్మాణ కార్మికులలో పనిచేస్తూ జీవితాన్ని గడుపుతున్నారు. దేశవ్యాప్త సారధిక సమ్మెతో కేంద్ర ప్రభుత్వం పునర్ ఆలోచించి ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పకుండా ప్రభుత్వ సంస్థలను కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

నిత్యవసర వస్తువులు పైకి పైకి వెళ్తుంటే కార్మికుల కూలీలు పనులు లేక పస్తులు ఉంటూ దొరికిన రోజు అతి తక్కువ కూలితో పని చేయించుకుంటున్నారు. ప్రమాద శక్తులు ఏదైనా జరుగుతే చాలామందికి లేబర్ కార్డు ,లేక ఇన్సూరెన్స్ వర్తించక గతంలో పనిచేసే చోట ప్రమాదవశాత్తు దెబ్బలు తగిలి వికలాంగులుగా మారుతూ మరణించిన వారి కుటుంబానికి ఇన్సూరెన్స్ నెలల తరబడి తిరగవలసి వస్తున్నది. భవన నిర్మాణ కార్మికుల కు వారికి సంక్షేమ పథకాలు కార్మికులకు అందని ద్రాక్షలా ఉన్నదన్నారు. ఈ కార్యక్రమంలో ఉడుత సోములు, ప్రసాదు. ,తుర్కపల్లి నరసింహ, శ్రీరాములు, నరసింహ, లక్ష్మణ్ నాయక్ ,కృష్ణ ,దర్శన్ పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img