Friday, May 9, 2025
Homeతెలంగాణ రౌండప్దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి..

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి..

- Advertisement -

ఆల్ హమాలి వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బొట్ల చక్రపాణి
నవతెలంగాణ – పరకాల 
: ఈ నెల 20న జరుగనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఆల్ హమాలి వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బొట్ల చక్రపాణి పిలుపునిచ్చారు. శుక్రవారం పరకాల పట్టణంలోని వివిధ రకాల హమాలీలను కలిసి సమ్మె కరపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం జరిగిన సమావేశానికి జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు ఆదాం అధ్యక్షత వహించగా చక్రపాణి మాట్లాడుతూ.. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం కార్మిక ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తూ దశాబ్దాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లు తీసుకొచ్చి కార్మికులకు ఉరితాలుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు‌. అనేక దశాబ్దాలు కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు కోడ్స్ ను బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చి కార్మిక హక్కులను హరిస్తుందన్నారు.దీంతో యజమానులతో భేరసారాలు ఆడే హక్కు ఉండదన్నారు. సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కులేక పోవడంతో పాటు 8 నుండి 12 గంటలకు పని చేయాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రయివేటు పరం చేస్తు జాతీయ సంపదను కొంతమంది కార్పోరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హమాలి కార్మికులకు భవన నిర్మాణ కార్మికుల తరహా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వమే వీరికి గుర్తింపు కార్డులు, ఈఎస్ఐ పిఎఫ్, పెన్షన్, పిల్లలకు స్కాలర్షిప్, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని చక్రపాణి డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంస్థలలో ఐకెపి, వ్యవసాయ మార్కెట్లు ,సివిల్ సప్లై, మార్కెట్ గోదాములు, ఎఫ్ సి ఐ లో పనిచేస్తున్న హమాలీలను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. హమాలీలు పని ప్రదేశంలో ప్రమాద లో మరణిస్తే రూ.25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. 50 సంవత్సరాలు పైబడిన హమాలీలకు రూ.9,000 వేల పెన్షన్ ఇవ్వాలని అనే డిమాండ్ చేశారు. ఈ సమస్యల కోసం జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో హమాలి కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో హమాలి సంఘం నాయకులు సాంబయ్య, మోహన్, రాజమౌళి ,రాజు, రమేష్ ,జంపయ్యలతో పాటు 50 మంది కార్మికులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -