Monday, February 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం12న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి

12న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి

- Advertisement -

ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ..నాలుగు లేబర్‌ కోడ్‌ల రద్దు కోసం సమ్మె : సీఐటీయూ ఉపాధ్యక్షులు ఎస్‌. వీరయ్య పిలుపు

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ రంగ సంస్థలు బలహీనపడుతున్నాయని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌ వీరయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 12న జరగనున్న దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం దేశంలో 11 ఏండ్లుగా అనుసరిస్తున్న ప్రయివేటీకరణ విధానాలు, వ్యూహాత్మక అమ్మకాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, నేషనల్‌ మానిటైజేషన్‌ పైపులైన్‌ వంటి చర్యలతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలు దేశంలో మౌలిక సదుపాయాలను కల్పించాయన్నారు.

బలహీనవర్గాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాయని గుర్తు చేశారు. ప్రజలకు నాణ్యమైన సరుకులు తక్కువ ధరలకు అందించాయని తెలిపారు. ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయి వేటీకరణ విధానాలతో ధ్వంసం చేస్తున్న నేపథ్యంలో నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ను రద్దు చేయాలని కోరారు. నాలుగు లేబర్‌ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల కార్మికుల హక్కుల సాధన కోసం ఈనెల 12న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. ఈ సదస్సుకు జె. రాఘవరావు, టి.రాజారెడ్డి అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. సీఐటీయూ రాష్ట్ర ఆఫీస్‌ బేరర్స్‌ జె. వెంకటేష్‌, ముత్యంరావు, బి.మధులతో పాటు వివిధ పబ్లిక్‌ సెక్టార్స్‌ నుంచి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -