Friday, September 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయండి..

కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయండి..

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ ..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

ఈనెల 27న సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రీజనల్ రింగ్ రోడ్డు (త్రిబుల్ ఆర్) అలైన్ మెంట్ మార్చాలని, భూములు కోల్పోతున్న నిర్వాసితులకు భూమికి బదులు భూమి ఇవ్వాలనే కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న మహాధర్నాలో భూములు కోల్పోతున్న రైతులు వారికి మద్దతుగా వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక సుందరయ్య భవన్, భువనగిరిలో సీపీఐ(ఎం) భువనగిరి మండల కమిటీ సమావేశం జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ అధ్యక్షతన జరగగా ఈ సమావేశంలో నర్సింహ పాల్గొని మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్ల పేరుతో వివిధ మండలాల్లోని రైతులకు సంబంధించిన వేలాద ఎకరాల భూములను గుంజుకుంటున్నారని విమర్శించారు.

రీజనల్ రింగ్ రోడ్డుకు ప్రభుత్వం చెప్పిన విధంగా హైదరాబాద్ ఔటర్ రోడ్డు నుండి 40 కిలోమీటర్లు అవుతల భాగంలో రీజినల్ రింగ్ రోడ్డు ఉండాలన్న ప్రతిపాదనను ఎమ్మెల్యేల, మంత్రుల, రియల్ ఎస్టేట్ సంస్థల, బడా వ్యాపారుల భూములను కాపాడడానికి, వారి ప్రయోజనాల కోసం మార్చారని విమర్శించారు. ఉత్తర భాగంలో గత అలైన్ మెంట్ ప్రకారం తుర్కపల్లి, రాజపేట యాదగిరిగుట్ట, మోటకొండూర్ మండలాల  మీదుగా భువనగిరి మండలంలోని చివరి గ్రామాల నుండి పోవలసిన రోడ్డు మధ్యన నుండి ఎందుకు పోతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఇప్పటికే ఈ ప్రాంత రైతులు యాదగిరిగుట్ట టెంపుల్, హైదరాబాద్ – వరంగల్ ప్రధాన రహదారి, కాలేశ్వరం ప్రాజెక్టు కాలువల కోసం, హై టెన్షన్ విద్యుత్తు లైన్లో కోసం భూములు కోల్పోగా ఉన్న కాస్త భూమిని కూడా రీజనల్ రింగ్ రోడ్ పేరుతో గుంజుకుంటే రైతులు ఏ విధంగా బతుకుతారని ఆవేదన వ్యక్తపరిచారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ ప్రతిపాదనలను విరమించుకోవాలని, ముందు ప్రకటించిన అలైన్ మెంట్  ప్రకారం రోడ్డు నిర్మాణం చేపట్టాలని, భూములు కోల్పోతున్న నిర్వాసితులకు భూమికి బదులు భూములు ఇవ్వాలనే డిమాండ్స్ తో నిర్వహిస్తున్న ధర్నాలో పెద్ద ఎత్తున రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు పాల్గొని ధర్నా నువ్వు జయప్రదం చేయాలని నర్సింహ కోరినారు. ఇంకా ఈ సమావేశంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, మండల కార్యదర్శివర్గ సభ్యులు కొండ అశోక్, మండల కమిటీ సభ్యులు పాండాల మైసయ్య, అబ్దులపురం వెంకటేష్, కొండపురం యాదగిరిలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -