Saturday, October 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి: సీఐటీయూ 

ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి: సీఐటీయూ 

- Advertisement -

నవతెలంగాణ – జోగులాంబ గద్వాల: తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయు అనుబంధం) 4వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షులు పద్మ ఆశా కార్యకర్తలకు పిలుపునిచ్చారు.శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మహాసభల పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ యూనియన్ రాష్ట్రా నాలుగవ మహాసభలు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఈనెల 26,27,తేదీలలో రెండు రోజుల పాటు జరగనున్నాయని తెలిపారు.

క్రౌన్ గార్డెన్ ఫంక్షన్ హల్ లో జరిగే మహాసభలలో భాగంగా మొదటి రోజు బహిరంగ సభ,రెండవ రోజు ప్రతినిధుల సభ ఉంటుందని తెలిపారు.ప్రభుత్వం ఆశాలకు 18000 ఫిక్డ్స్ వేతనం చెల్లిస్తామని, పియఫ్, ESI కల్పిస్తామని, ANM, GNM ట్రైనింగ్ పూర్తి చేసిన ఆశాలకు ANM, GNM పోస్టులలో డైరెక్ట్ ప్రమోషన్ సౌకర్యం కల్పిస్తామని లేదా వేయిటేజి మార్కులు నిర్ణయిస్తామని వంటి అనేక హామీలు ఇచ్చిందని తెలిపారు.ఇచ్చిన హామీలు అమలు చేయకపోగ ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా,అదనంగా చేయించిన పనులకు డబ్బులు ఇవ్వకుండా,అదనపు పని భారలను మోపుతూ ఆశాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు.

రాష్ట్ర మహాసభలకు ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులతో పాటు, సీఐటీయు రాష్ట్ర నాయకత్వం హాజరు కానుందని తెలిపారు. మహాసభలలో ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలు, చేసిన పోరాటాలు,సాధించిన విజయాలు, భవిష్యత్తు కర్తవ్యాలు రూపొందించుకుంటామని తెలిపారు. 26 న జరిగే బహిరంగ సభకు జిల్లాలోని ఆశా కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమం లో సీఐటీయు జిల్లా కార్యదర్శి వివి నరసింహ జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పేర్ నరసింహ,104 ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.బీచుపల్లి, జిల్లా ఉపాధ్యక్షులు కాంతమ్మ,ఆశాలు మేరీ, సుజాత, గోవిందమ్మ పార్వతమ్మ, కవిత సరోజ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -