Saturday, July 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జులై 9న సమ్మెను జయప్రదం చేయండి: సీపీఐ(ఎం)

జులై 9న సమ్మెను జయప్రదం చేయండి: సీపీఐ(ఎం)

- Advertisement -

సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పిలుపు
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
: కార్మిక హక్కుల కొరకై జూలై 9న సమ్మెను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం మున్సిపల్ కార్మికుల లో జూలై 9న సమ్మె జయప్రదం కొరకు మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ గౌరవ అధ్యక్షులు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు వివిధ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించి కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. దేశంలో స్వతంత్ర పూర్వం నుండి కార్మిక వర్గం పోరాడి అనేక హక్కులు సాధించటం జరిగిందని తెలిపారు.

అలా సాధించిన 29 చట్టాలను నేటి కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు కార్మిక కోడ్లను తీసుకుని వచ్చిందని అన్నారు. వీటివల్ల కార్మికులకు కనీస వేతనాలు అమలు జరిగాక, ఎనిమిది గంటల పని 12 గంటలకు మార్చటం వల్ల, ఉద్యోగ భద్రత కొరవడి అనేక సమస్యలు ఎదురవుతాయని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు కనుగుణంగా సమాన పనికి సమాన వేతనాలను అమలు చేయించాలని అన్నారు. నిత్యవసర సరుకుల ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 9న అన్ని కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా కోట్లాదిమంది సమ్మెలోకి వస్తున్నందున మున్సిపల్ కార్మికులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కార్మిక వర్గ సత్తాను చూపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు భూపతి, రేకులు నరసయ్య, సంతోష్, ఏక్ నాథ్, సదాశివ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -