Tuesday, October 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఐటీయూ జిల్లా మూడో మహాసభలను జయప్రదం చేయండి

సీఐటీయూ జిల్లా మూడో మహాసభలను జయప్రదం చేయండి

- Advertisement -

నవతెలంగాణ – వంగూరు
నవంబర్ మొదటి వారంలో నాగర్కర్నూల్ పట్టణంలో జరుగు సిఐటియు మూడవ మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు బి ఆంజనేయులు కార్మిక కర్షక ఉద్యోగ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన  వంగూరు మండల కేంద్రంలో జరిగిన సిఐటియు మండల కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కార్మిక కర్షక ఐక్యత సామాజిక న్యాయం సమాన పనికి సమాన వేతనం కోసం నిరంతరం కృషి చేస్తున్న సంఘం సిఐటియు అని అన్నారు. రాష్ట్రం  వ్యాప్తంగా విస్తరించి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తుందని అన్నారు. ప్రభుత్వ ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో పనిచేస్తున్న ఆశ అంగన్వాడి మధ్యాహ్న భోజనం ఫీల్డ్ అసిస్టెంట్లు ఆర్టీసీ వివోఏ మెడికల్ అండ్ హెల్త్ ఔట్సోర్సింగ్ అసంఘటిత రంగ కార్మికులైన భవన నిర్మాణ హమాలి ఆటో కార్మికుల సమస్యలపై నికరంగా నిలిచి పోరాడుతుందని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కారం అవుతాయని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు రెగ్యులర్ అవుతాయని ఎంతో ఆశతో ఉన్నా వారి ఆశలు అడి ఆశలైనాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా ఉద్యోగ భద్రత కనీస వేతనం తదిత సౌకర్యాలు లేక కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో సంస్థ తరబడి పోరాడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు కోడ్లను విభజించిందని ఇది కార్మికులకు పెను ప్రమాదంగా ముప్పు వాటిల్లుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ శక్తులకు లాభాలు చేకూరుస్తూ కార్మికుల పొట్టలు కొడుతున్నారని అన్నారు రైతు వ్యవసాయ కూలీలకు పోరాటాలకు అండగా నిలుస్తూ పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా కనీస వేతనాలు పెంచాలని ఆందోళన చేపట్టడంలో అగ్రభాగాన సంఘం నిలబడిందని అన్నారు. 

ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కు భవిష్యత్తులో కార్మికులను ఉద్యోగులను ప్రజలను కదిలించి ఆందోళన పోరాటాలు చేస్తామని అన్నారు. నవంబర్లో జరగబోయే సిఐటియు జిల్లా మహాసభల లో కార్మికులు ఉద్యోగులు రైతులు కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభలు జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి బి శివరాములు గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు వెంకటయ్య సురేష్ ఫీల్డ్ అసిస్టెంట్ మండల నాయకులు జి శ్రీనివాసులు హమాలీ సంఘం అధ్యక్షులు గెలువయ్య మిషన్ భగీరథ సంఘం మండల నాయకులు బాలస్వామి ఆటో యూనియన్ నాయకులు సంజీవ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -