Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంవనమహోత్సవం విజయవంతం చేయండి

వనమహోత్సవం విజయవంతం చేయండి

- Advertisement -

మునగ సాగును ప్రోత్సహించాలి…
అడిషనల్ డీఆర్డీఓ ఎన్.రవి
నవతెలంగాణ – అశ్వారావుపేట
: ఈ ఏడాది నిర్వహించే వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని అడిషనల్ డీఆర్డీఓ ఎన్.రవి ఎంజీ ఎన్ఆర్ ఈజీ ఏ క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. ఈ పధకం పనులు నిర్వహణ,మంచి పాలన,రిజిష్టర్ లు నమోదు పై పధకం సిబ్బంది టీఏ,ఎఫ్ఏ,పంచాయితీ కార్యదర్శులు కు ఒక రోజు స్థానిక మండల పరిషత్ కార్యాలయం సభా ప్రాంగణంలో నిర్వహించిన ఓరియంటేషన్ ట్రైనింగ్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ అద్యక్షతన నిర్వహించిన ఈ శిక్షణా శిబిరంలో ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పధకం లో అనేక రాయితీలు లు ఉన్నాయని,రైతులను సమీకరించి,వివరించి పండ్లతోటలు పెంచే విధంగా అవగాహన కల్పించాలని అన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా మునగ పంట సాగు అవుతుందని,ఈ వ్యవసాయ సీజన్ లో మరింత ప్రోత్సహించాలని కోరారు.

ముందుగా ఆయన మండలంలోని అచ్యుతాపురం నర్సరీ,కాశిని బాలరాజు సాగు చేస్తున్న మునగ పంటను,మద్ది కొండలో నారం పెంటయ్య సాగుచేస్తున్న డ్రాగన్ ఫ్రూట్ పంటను తనిఖీ చేసారు. ఈ కార్యక్రమంలో ఎంజీ ఎన్ఆర్ ఈజీ ఏ ఏపీఓ రామచంద్రరావు,ఆయా పంచాయితీల కార్యదర్శులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img