Saturday, March 14, 2026
E-PAPER
Homeఆదిలాబాద్వైభవంగా మల్లన్న స్వామి ఆలయ ప్రారంభోత్సవం

వైభవంగా మల్లన్న స్వామి ఆలయ ప్రారంభోత్సవం

- Advertisement -

-పాల్గొన్న బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్..
నవతెలంగాణ – జన్నారం

జన్నారం మండలంలోని రేండ్లగూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన మల్లన్న స్వామి దేవాలయ ప్రారంభోత్సవ వేడుకలు శనివారం  అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నిర్మల్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రితిష్  రాథోడ్ ముఖ్య అతిథిగా పాల్గొని, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ నిర్మాణానికి భూమి ఇచ్చి సహకరించిన,తమ వంతు ఆర్థిక సాయం అందించి,అంకితభావంతో సహకరించిన దాతలను రితేష్ రాథోడ్ శాలువాలతో ఘనంగా సన్మానించారు. భక్తి భావం సమాజంలో ఐక్యతను పెంచుతుందని,ఆలయాల పునర్నిర్మాణంలో భాగస్వాములవ్వడం అదృష్టమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సేటుపల్లి రాజేశ్వరి  సత్యం గ్రామ సర్పంచ్ అల్లం మాధవి రవి, జన్నారం మండల బీజేపీ అధ్యక్షులు మధుసూదన్ రావు,ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్,కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు బెడద గోపాల్,జిల్లా నాయకులు శంకరయ్య,పొనకల్ ఉప సర్పంచ్ అప్పాల జలపతి,ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు అజ్మీరా బద్రి నాయక్, బిజేవైఎం రాష్ట్ర నాయకులు పవన్ యాదవ్, మండల స్థాయి పార్టీ నాయకులు,కార్యకర్తలు మరియు రెండ్లగూడ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -