Wednesday, October 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోషకాహార లోపాన్ని నివారించాలి: డిడబ్ల్యుఓ రాజేశ్వరి 

పోషకాహార లోపాన్ని నివారించాలి: డిడబ్ల్యుఓ రాజేశ్వరి 

- Advertisement -

నవతెలంగాణ – బల్మూరు
గర్భవతులు బాలింతలు చిన్నారుల్లో పోషక ఆహార లోపాన్ని నివారించాలని జిల్లా ఐసిడిఎస్ అధికారి రాజేశ్వరి అన్నారు. మండల కేంద్రంలో బుధవారం రైతు వేదికలో పోషణ మాసం ముగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. గర్భిణి బాలింతలు చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించడానికి ప్రతి ఒక్కరూ ఆకుకూరలు, పాలు, పండ్లు గుడ్లు వంటి బలమైన పోషకాహారం తీసుకోవాలని అన్నారు. కిషోర బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రత గురించి నేర్పించాలని పరిసరాల పరిశుభ్రత పట్ల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అన్నారు. బాలికల వసతిగృహం, కస్తూర్బా గాంధీ విద్యాలయంలోని విద్యార్థినిలకు పోషకాహారం పై వ్యాసరచన పోటీ నిర్వహించగా ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అంద చేయడం జరిగింది.

ఆరు నెలలు దాటిన చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడి కేంద్రాల లబ్ధిదారులైన గర్భవతులకు పూలు పండ్లు ఇచ్చి సన్మానించారు. ఈ కార్యక్రమంలో బల్మూరు ప్రాజెక్టు సిడిపిఓ దమయంతి, సూపర్వైజర్లు బిపాషా, నిర్మల, గిరిజ ,సునీత, పోషణ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ పార్వతి, ఈసీ సి ఈ జిల్లా కో – ఆర్డినేటర్ గౌతమి, ఉమెన్ హబ్ సునీత, బల్మూరు ప్రాజెక్టు మండలాలైన బల్మూరు, లింగాల, ఉప్పునుంతల మండలాల అంగన్వాడి టీచర్లు, ఆయా గ్రామాల అంగన్వాడి కేంద్రాల లబ్ధిదారులు గర్భవతులు, బాలింతలు తల్లులు, కిషోర బాలికలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -