Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్రెంజల్ ఇన్చార్జి తహశీల్దారుగా మమత

రెంజల్ ఇన్చార్జి తహశీల్దారుగా మమత

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్ 
రెంజల్ మండల ఇంచార్జ్ తహసిల్దార్ గా మమత శుక్రవారం బాధ్యతలను తీసుకున్నారు. రెంజల్ తహసిల్దారుగా పనిచేసిన శ్రావణ్ కుమార్ సెలవుపై వెళ్లడంతో, వర్ని ఉపతహసిల్దార్ గా విధులు నిర్వహిస్తున్న మమతను రెంజల్ తహసిల్దార్ గా బాధ్యతలు ఇవ్వడంతో ఆమె ఈరోజు కార్యాలయానికి వచ్చి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధ సమస్యలతో కార్యాలయానికి వచ్చే వారి పనులను త్వరితగతంగా పూర్తి చేయడానికి తన వంతు సహాయ సహకారాలను అందిస్తామని ఆమె పేర్కొన్నారు. రెవెన్యూ సిబ్బంది వివరాలను ఆమె తెలుసుకున్నారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ, ప్రతిరోజు కార్యాలయానికి వచ్చే ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించి, పనులు పూర్తి చేయాలని ఆమె సిబ్బందికి సూచించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad