Friday, July 11, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకల్తీ పాలు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు..

కల్తీ పాలు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు..

- Advertisement -

5 కిలోల దూల్పూరు ఫ్రెష్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్..
500 మిల్లీలీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్..
400 మిల్లీమీటర్ల ఎసిటిక్ యాసిడ్ స్వాధీనం…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
: కల్తీ పాలు తయారుచేసి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన సంఘటన మండల పరిధిలోని మన్నె వారు పంపు గ్రామంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. భువనగిరి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మన్నేవారు పంపు గ్రామంలో పాలను కల్తీ చేస్తున్నారనే విశ్వనియ సమాచారం మేరకు గ్రామంలో తనిఖీలు నిర్వహించగా, సామల సత్తిరెడ్డి అనే వ్యక్తి వద్ద 80 లీటర్ల కల్తీ పాలు, 5 కిలోల దూల్పూరు ఫ్రెష్ స్కీమ్డ్ మిల్క్ పౌడర్ ప్యాకెట్లు, 500 మిల్లీలీటర్లు హైడ్రోజన్ పెరాక్సైడ్, 400 మిల్లీలీటర్ల ఎసిటిక్ యాసిడ్ స్వాధీనం చేసుకున్నారు.  

కాగా.. సామల సత్తిరెడ్డి ఈ కల్తీ పాలను హైదరాబాదుకు తరలిస్తూ పాల వ్యాపారం చేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెళ్లడైందని , ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ ఎం అనిల్ కుమార్ తెలిపారు. భవిష్యత్తులో భువనగిరి మండల పరిధిలో ఎవరైనా కల్తీ పాలను తయారు చేస్తే వారి మీద కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -