- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
మండలంలోని జేపల్లి గ్రామానికి చెందిన వంకేశ్వరం వెంకటయ్య (35 ) భార్య సంవత్సరం క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో ఆయన తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు.. ఎస్సై శంషుద్దీన్ బృందం సంఘటన స్థలానికి చేరుకొని, తండ్రి లక్ష్మయ్య ఇచ్చిన సమాచారం మేరకు సంవత్సరం క్రితం భార్య అలివేలు అనారోగ్యంతో మృతి చెందడంతో వంకేశ్వరం వెంకటయ్య మనస్థాపానికి గురై రాత్రి సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడి చనిపోయాడు. వెంకటయ్య మరణం పై ఎవరి ఒత్తిడి లేదని కుటుంబ సభ్యులు తెలపడంతో పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -