నవతెలంగాణ – ఆలేరు టౌను
ఆలేరు పట్టణంలో వ్యక్తి ఫ్యాన్ కి ఉరివేసుకొని మృతి చెందిన సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం సుంచనకోట గ్రామానికి చెందిన తాటి జగదీష్ (45) గత పది సంవత్సరాల క్రితం ఆలేరు పట్టణానికి బతుకుదెరువు నిమిత్తం వచ్చాడు. పోచమ్మ గుడి సమీప కాలనీలో ఇల్లు కిరాయి తీసుకొని, కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. గత కొంతకాలంగా మృతుడు ఏ పనిచేయకుండా, మద్యానికి బానిసై, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా మృతుడికి భార్య కుమార్తె, కుమారుడు ఉన్నారు. సమాచారం అందుకున్న ఎస్సై ఎన్ వినయ్ ఘటనా స్థలానికి చేరుకుని పంచనామ నిర్వహించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్ యాలాద్రి తెలియజేశారు.
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



