అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య 

నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్ 

అప్పుల బాధ తాళలేక వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని మృతి చెందిన సంఘటన హుస్నాబాద్ పట్టణ శివారులో మంగళవారం చోటుచేస్తుంది .స్థానికులు తెలిపిన ప్రకారం పట్టణం లోని బుడగ జంగాల కాలనీకి చెందిన చెన్నూరు సమ్మయ్య (40) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం రాత్రి ఇంటి వద్ద అప్పులు ఎలా తీర్చాలని భార్య భర్తల మధ్య వాగ్వివాదం జరిగింది . దీంతో ఇంటి నుండి బయటకు వెళ్లిన సమ్మయ్య మోడల్ స్కూల్ సమీపంలో చెట్టు కు ఊరి వేసుకొని ఆత్మహత్య చేస్తున్నాడు. గమనించిన స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు.
Spread the love