- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
చారకొండ మండలంలోని మర్రిపల్లి గ్రామంలో కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై శంషుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి మర్రిపల్లి వద్ద గ్రామానికి చెందిన ఎ .దాస్య (55)రోడ్డు దాటుతుండగా కల్వకుర్తి నుండి దేవరకొండకు వెళ్తున్న కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుడికి భార్య బుజ్జి, నలుగురు పిల్లలు ఉన్నారు. పెద్ద కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
- Advertisement -