Sunday, October 12, 2025
E-PAPER
Homeక్రైమ్బైకు డివైడర్ కు ఢీకొని వ్యక్తి మృతి 

బైకు డివైడర్ కు ఢీకొని వ్యక్తి మృతి 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నగరంలోని మూడవ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు. ఈ క్రమంలో బైక్ స్కిడ్డై డివైడర్ కు ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనదారుడు అక్కడిక్కడే మృతి చెందినట్లు మూడవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ హరిబాబు ఆదివారం తెలిపారు. ఎస్సై హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి 10 గంటల 30 నిమిషాల సమయంలో దుర్భబాది రోడ్ నందు శివాజీ చౌక్ నుండి దుబ్బ వైపు వెళ్లుచున్నా పల్సర్ బైకు కృష్ణ మందిరం వద్ద సైకిల్ పైన వస్తున్న వ్వక్తిని తపించిబోయి రోడ్ పైన డివైడరికి గుద్దడంతో బైకపైన ఉన్న ఇద్దరు కింద పడినారు. బైక్ నడిపిన ప్రశాంత్ గవర్నమెంట్ హాస్పిటల్ లో చనిపోయారు. మరో వ్యక్తి సందీప్ ప్రయివేట్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నాడు. మృతుని తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -