- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలో జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులను రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డిని సన్మానించారు. ఈ మేరకు గురువారం నిజామాబాద్ లో నూతనంగా విజయం సాధించిన కోనాపూర్ సర్పంచ్ రిక్కల అరుణ్ రెడ్డి, కొత్త చెరువు తండ సర్పంచ్ లకావత్ సంతోష్ నాయక్ లు మానాల మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి నూతన కోనాపూర్ సర్పంచ్ రిక్కల అరుణ్ రెడ్డి, కొత్తచెరువు తాండ సర్పంచ్ సంతోష్ నాయక్ లను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి, కోనాపూర్ ఉప సర్పంచ్ ఉదయ్, మహేష్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



