ఇంకెప్పుడూ బాధపెట్టను

2 గంటల క్రితం

hurt
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026 | 4 నిమిషాల చదవడం

జీవితం మనిషికి అన్నీ నేర్పిస్తుంది. మంచీ చెడు.. అన్నీ జీవిత అనుభవం నుండే మనం నేర్చుకుంటాము. ఈ అనుభవానికి వయసుతో కూడా పని లేదు. కొంత మందికి చిన్న వయసులోనే ఎన్నో ఎన్నుభవాలు ఎదురవుతాయి. కొంతమందికి వయసు ఎంత పెరిగినా జీవితం పట్ల అవగాహనే ఉండదు. సమస్య వచ్చినపుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. పైగా నేను చెప్పిందే సరైనది అని వాదిస్తుంటారు. అనుభవంతో చెప్పిన మాటలు కూడా లెక్కచేయరు. అలాంటి కథనమే ఈ వారం ఐద్వా అదాలత్‌ (ఐలమ్మ ట్రస్ట్‌‌)లో మీ కోసం...


రచనకు దాదాపుగా 30 ఏండ్లు ఉంటాయి. భర్త రమేష్‌‌కు 38 ఏండ్లు. వీరికి మూడేండ్ల పాప ఉంది. రచన, అత్తమామలతో కలిసి ఉందామన్నా వినకుండా రమేష్‌ వేరు కాపురం పెట్టాడు. ఇతనికి మగాడిని అనే అహంకారం ఎక్కువ. భార్య అంటే భర్త చెప్పినట్టు వినాలి అంతే తప్ప మరో మాట మాట్లాడకూడదు. ఏ విషయంలోనూ రచన అభిప్రాయం తీసుకోడు. అసలు ఆమె అభిప్రాయమే అవసరం లేదని అతని ఆలోచన. భార్యను ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడుతుంటాడు. దీని వల్ల ఇద్దరి మధ్య గొడవలు వస్తుంటాయి. చిన్న పాప ఉంది, బయటకు వెళ్లినపుడు, ఏదైనా ఫంక్షన్‌‌కి వెళ్లినపుడు ఇంటికి త్వరగా వెళ్లాలంటుంది రచన. ఈ విషయంలో కూడా ఆమెనే తప్పుపడుతుంటాడు. ఇంట్లో వంట కూడా అతను చెప్పిందే చేయాలి. అలా కాదు అని ఎప్పుడైనా ఆమెకు నచ్చింది చేస్తే ఇక ఆరోజు ఇంట్లో గొడవే. అతని గురించి వాళ్ల ఇంట్లో వాళ్లకు చెప్పినా మళ్లీ అదో పెద్ద గొడవ. దీనికి తోడు రమేష్‌‌కు తాగే అలవాటు కూడా ఉంది.

ఏ పనీ సరిగ్గా చేయడు. ఇంటి కిరాయి కూడా సరిగ్గా కట్టడు. కిరాయి కట్టాలి కదా అంటే ‘నా దగ్గర డబ్బులు లేవు, ఉంటే కడతా కదా! అర్థం చేసుకోకుండా ఊరికే డబ్బులు డబ్బులు అంటే ఎక్కడి నుండి తీసుకురావాలి?’ అంటాడు. పెండ్లి జరిగి దాదాపు ఆరేండ్లు అవుతుంది. ఇప్పటి వరకు భార్యకు గానీ, పాపకు గానీ అతను ఒక్క డ్రెస్సు తీసుకురాలేదు. అతన్ని ఎలా అర్థం చేసుకోవాలే తెలియక సలహా కోసం ఐద్వా ఆఫీస్‌‌కు వచ్చి ‘మేడం ఈ మధ్య కాలంలో మేము రాత్రి 11 గంటలకు ఓ ఫంక్షన్‌‌కి వెళ్లివస్తున్నాము. ఇంకా అక్కడే ఉందాము అంటారు ఆయన. దానికి నేను ఒప్పుకోలేదు. పాప నిద్రపోయింది. చీకటిలో ఎందుకు అన్నాను. అంతే ఆ టైంలో నన్ను రోడ్డు పైనే వదిలేసి వెళ్లిపోయారు. పాప పడుకొని ఉంది. అక్కడే నేను ఓ పదిహేను నిమిషాలు ఉండి ఇంటికి వచ్చేశాను. నేను వచ్చేసరికి ఆయన ఇంట్లోనే ఉన్నారు. ఈ విషయం నేను తర్వాత రోజు మా అత్తయ్యకు, తోటి కోడలికి, ఆడపడుచుకు చెప్పాను. అదే నేను చేసిన తప్పుగా రమేష్‌కు కనిపించింది. ‌కానీ ఆయన నన్ను రోడ్డుపైన వదిలిపెట్టి వెళ్లింది కనిపించలేదు. పైగా ‘నువ్వు నా మాట వినడం లేదు, అందుకే నాకు అవసరం లేదు, మీ ఇంటికి వెళ్లిపో’ అంటూ గొడవ చేస్తున్నాడు.

ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు, అందుకే మా ఆడపడుచు చెబితే మీ దగ్గరకు వచ్చాను’ అంటూ కన్నీళ్లు పట్టుకుంది. మేము రామేష్‌కు ఫోన్‌ ‌చేసి పిలిపించాము. రచన చెప్పిన విషయం గురించి అడిగితే ‘ఆమె నేను చెప్పినట్లు వినలేదు. ఇంత చిన్న విషయం అందరికీ చెప్పి నన్ను తలదించుకునేలా చేసింది. అందరితో నన్ను తిట్టించింది. భార్యాభర్తల మధ్య చాలా విషయాలు ఉంటాయి. ఇలా ప్రతి విషయం అందరికీ చెప్పడం కరక్టేనా? అంతే కాదు నాతో అన్నీ అబద్దాలు చెబుతుంది’ అన్నాడు. ‘నేనేం అబద్దాలు చెప్పాను’ అంటే ‘ఆమె దగ్గర డబ్బులు వున్నా లేవని చెప్పింది. ఇలా అబద్దం చెప్పడం, నేను చెప్పినట్లు వినకపోవడం వల్లనే నాకు కోపం వచ్చింది. అందుకే ఆమె నాకు వద్దు అంటున్నాను’ అన్నాడు. ‘నన్ను రోడ్డుపైన వదిలి పెట్టడమే కాకుండా ఆయన చేసిందే సరైనది అంటున్నాడు. తన మాట వినకపోతే ఇలాగే చేస్తానని కూడా అంటున్నాడు. ఇలాంటి వ్యక్తితో ఎలా కలిసి జీవించాలి. నేను అతనితో కలిసి ఉండను. మా ఊరికి వెళ్లిపోతాను. ఏదో ఒక పని చేసుకొని బతుకుతాను. అతనికి భార్యంటే ప్రేమ, నమ్మకం లేదు. కనీసం పాపపైన కూడా ప్రేమ లేదు. నేను ఇంట్లో నుండి వచ్చేసి వారం అవుతుంది. ఇప్పటి వరకు కనీసం ఫోన్‌ ‌కూడా చేయలేదు. ఈ వారం రోజులు నేనూ, పాప ఎక్కడికి వెళ్లాము, ఎలా ఉన్నాము అనే ఆలోచనే అతనికి లేదు’ అంది.


‘తను పాపతో మా అక్క వాళ్ల ఇంట్లో ఉందని నాకు తెలుసు, అందుకే ఫోన్‌ ‌చేయలేదు’ అన్నాడు. రమేష్‌ వాళ్ల అక్క మాట్లాడుతూ ‘మీరిద్దరు కలిసి మెలిసి సంతోషంగా ఉంటారని పెండ్లి చేశాము. ఇలా చిన్న చిన్న విషయాలకే విడిపోతారని కాదు. భార్యాభర్తలు ఒకరికి ఒకరు అండదండగా ఉండాలి. ఇద్దరూ కలిసి ఉంటేనే బంధానికి ఓ గౌరవం’ అన్నది. దానికి రచన ‘నేను బాగా చీకటి పడింది, ఇంటికి వెళదాం అన్నాను. దానికే అతను రోడ్డుపై వదిలిపెట్టి వెళ్లిపోవాలా? ఇంకోసారి ఇలా జరగదు అంటే ఇన్ని గొడవలు జరగవు కదా! ఆయన అలా కాకుండా తను చెప్పినట్టు చేయకపోతే ఇలాగే చేస్తానని చెబుతున్నాడు. నేను ఆయన గురించి ఎవరికి చెప్పాను. నా కుటుంబ సభ్యులకే కదా? నాకు కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలి. వాళ్లకే కదా! మా అమ్మ వాళ్లకు ఆయన గురించి ఎప్పుడూ చెప్పలేదు. ఎప్పడూ మా అత్త, ఆడపడుచు, తోటికోడలితోనే మాట్లాడతాను. పెండ్లి తర్వాత మొత్తం ఇక్కడే, వీళ్లతోనే అనుకున్నాను.


అందుకే వీళ్లకే చెప్పుకుంటాను. అందుకే పాపను తీసుకొని పుట్టింటికి వెళ్లకుండా మా ఆడపడుచు ఇంటికి వెళ్లాను’ అంది. దాంతో రమేష్‌ ఆలోచనలో పడ్డాడు. ‘రచనా నన్ను క్షమించు. నువ్వు లేకుండా నేను ఉండలేను. ఊరికి వెళ్లిపోకుండా మా అక్క వాళ్ల ఇంటికి వెళ్లి మంచి పని చేశావు. నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. అందరితో నన్ను తిట్టించావని అనుకున్నాను కానీ, నువ్వు నా కోసమే ఉన్నావనే విషయం పట్టించుకోలేదు. ఇకపై నిన్ను, పాపను ప్రేమగా చూసుకుంటాను. ఇద్దరి కలిసి సంతోషంగా ఉందాము’ అన్నాడు. ‘మంచి విషయం. మీ భార్య మనసు అర్థం చేసుకున్నారు. ఇకపై ఎలాంటి సమస్యలూ లేకుండా సంతోషంగా ఉండండి. రచనా నీకు నీ కుటుంబం అండగా ఉంది. ముఖ్యంగా ఆడపడుచు నీకు చాలా సపోర్ట్‌‌గా ఉంది చాలా గొప్ప విషయం. ఇలాగే ఏ మమస్య వచ్చినా కుంగిపోకుండా ధైర్యంగా పరిష్కరించుకో’ అని చెప్పి పంపించాము.


‘తను పాపతో మా అక్క వాళ్ల ఇంట్లో ఉందని నాకు తెలుసు, అందుకే ఫోన్‌ ‌చేయలేదు’ అన్నాడు. రమేష్‌ వాళ్ల అక్క మాట్లాడుతూ ‘మీరిద్దరు కలిసి మెలిసి సంతోషంగా ఉంటారని పెండ్లి చేశాము. ఇలా చిన్న చిన్న విషయాలకే విడిపోతారని కాదు. భార్యాభర్తలు ఒకరికి ఒకరు అండదండగా ఉండాలి. ఇద్దరూ కలిసి ఉంటేనే బంధానికి ఓ గౌరవం’


- వై వరలక్ష్మి, 9948794051

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్