Magazines

మరో భిన్న ప్రేమకథ

1 గంట క్రితం

కృష్ణ క‌మ‌ల్, మ‌హి
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 12, 2026 | 1 నిమిషాల చదవడం

కృష్ణ క‌మ‌ల్, మ‌హి జంటగా రూపొందుతున్న రూర‌ల్ కామెడీ డ్రామా ‘జో జో’. ద‌ర్శ‌కుడు దేవ‌క‌ట్టా స‌మ‌ ర్ప‌ణ‌లో కిర‌ణ్ జ‌య్ కుమార్ ద‌ర్శ‌కుడిగా రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందు తోంది. విజ‌యం బ్యాన‌ర్‌పై విజ‌య్ కృష్ణ లింగ‌మ‌నేని నిర్మిస్తున్నారు. సోమ‌వారం కాష‌న్ 1 పేరుతో ఈ సినిమా కంటెంట్ ఏంట‌నే విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఓ వీడియో గ్లింప్స్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. రాయ‌ల‌సీమ‌లోని జొన్న‌గిరి నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న సినిమా. వ‌ర్షాలు ప‌డిన‌ప్పుడు అక్క‌డ వ‌జ్రాలు దొరుకు తాయ‌నే వార్త‌లు మ‌నం వినే ఉంటాం. ఆ పాయింట్‌ను ఆధారంగా చేసుకుని రూర‌ల్ ల‌వ్ స్టోరీగా కామెడీ ట‌చ్‌తో నిర్మిస్తున్నారునిర్మిస్తున్నారు. ఈ కాష‌న్ వీడియో గ‌మ‌నిస్తే.. మ‌నోభావాల బ్యాచ్ దూరంగా ఉండండి అనే క్యాప్ష‌న్‌తోనే ఇది మొద‌ల‌వు తుంది. వ‌ర్షం ప‌డిన త‌ర్వాత పొలంలో హీరో హీరోయిన్‌తో పాటు కొంద‌రు వ‌జ్రాల‌ను వెతుకుతుంటారు. హీరోయిన్‌కు ఓ రాయి దొర‌కుతుంది. ఆమెను ప్రేమించే హీరో ఆమె ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి మాట్లాడే ప్ర‌య‌త్నం చేస్తాడు. అయితే ఆమె అత‌డ్ని ఓ బూతు మాట‌తో నోరు మూయించేస్తుంది. ఆ మాట విని హీరోతో పాటు.. అక్క‌డున్న హీరో ఫ్రెండ్ కూడా షాక‌వు తాడు. అయితే హీరో దాన్ని కూడా మోటు స‌ర‌సం అంటూ క‌వ‌ర్ చేయ‌టం.. చూస్తే న‌వ్వు తెప్పిస్తుంది. ఈ సినిమాకి మ్యూజిక్‌: మ‌హేష్ శంక‌ర్‌, స్టోరి, స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌: కిర‌ణ్ జ‌య్ కుమార్‌, సినిమాటోగ్ర‌ఫీ: రోహిత్ కుమార్‌, ఎడిట‌ర్‌: మాధ‌వ్ కుమార్ గుళ్ళ‌ప‌ల్లి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: నాగి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్