Magazines

పెసరపిండితో!

1 గంట క్రితం

gram flour
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం

అమ్మమ్మల కాలం నుంచే పెసరపిండిని సౌందర్య సాధనంగా వాడుతున్నారు. ఈ పిండిలో ఉండే సహజ శుద్ధి లక్షణాలు చర్మాన్ని లోతుగా శుభ్రపరిచి, మృదుత్వాన్ని, కాంతిని అందిస్తాయి. కృత్రిమ రసాయనాలతో కూడిన సబ్బులకు బదులుగా పెసర పిండి చర్మ సౌందర్యానికి ఎంతో ఉపయోగకరం. ఇది చర్మానికి మృదుత్వం ఇచ్చి, సహజంగా, కాంతివంతంగా మార్చుతుంది. ప్రయోజనాలు పెసరపిండి లో చర్మానికి మేలు చేసే ఎన్నో లక్షణాలున్నాయి. ఇది చర్మంలోని మురికి, నూనెను తొలగించి, రంధ్రాలను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. మెల్లగా రుద్దినప్పుడు, చర్మంపై ఉన్న చనిపోయిన కణాలను తొలగించి, కొత్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. దీని వలన చర్మం మెరుపుగా, తాజాగా కనిపిస్తుంది. ముఖ్యంగా నూనె చర్మం ఉన్నవారికి పెసరపిండి వరం లాంటిది. ఇది అదనపు నూనెను పీల్చుకుని, మొటిమలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యల నుండి రక్షిస్తుంది. క్రమం తప్పకుండా పెసరపిండి వాడడం ద్వారా చర్మపు రంగు కూడా మెరుగవుతుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్