నవతెలంగాణ – ఆర్మూర్
69వ అర్బన్ మండల స్థాయి అంతర పాఠశాలల క్రీడోత్సవాలు మంగళవారం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి కన్వీనర్‌గా పి. లక్ష్మీ నర్సయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పి.డి. బి. మల్లేశ్ గౌడ్ వ్యవహరించారు. ముఖ్య అతిథిగా ఏసిపి వెంకటేశ్వర్ రెడ్డి , మున్సిపల్ కమిషనర్ రాజు, ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ వాలీబాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎన్.వి. హనుమంత్ రెడ్డి, మండల విద్యాధికారి రాజగంగారం ప్రభుత్వం, ప్రయివేటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మండలంలోని ప్రభుత్వం, ప్రయివేట్ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు విస్తృతంగా పాల్గొన్నారు. క్రీడా పోటీలను ఆరంభించిన వివిధ పాఠశాలల నుండి విద్యార్థుల మార్చ్ ఫాస్ట్ ప్రదర్శనలు ఎంతో ఆకర్షణీయంగా సాగాయి. విజేతలకు ప్రముఖ అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
మార్చ్ పాస్ట్ విజేతల జాబితా:
ప్రభుత్వ పాఠశాలలు:
ప్రథమ బహుమతి పట్టణ బాలికల పాఠశాల
ద్వితీయ బహుమతి మామిడిపల్లి, పాఠశాల
తృతీయ బహుమతి పట్టణ బాలుర పాఠశాల
ప్రోత్సాహక బహుమతులు కేజీబీవీ, రామమందిర్
ప్రయివేటు పాఠశాలలు
ప్రథమ బహుమతి సెయింట్ ఆన్స్ హై స్కూల్ , ద్వితీయ బహుమతి నలంద హై స్కూల్
తృతీయ బహుమతి బ్రిలియంట్ హై స్కూల్
ప్రోత్సాహక బహుమతి లు పెర్కిట్ కాంతి హై స్కూల్ కు ఎంపికయ్యాయి. ఇ క్రీడోత్సవం ద్వారా విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని, జట్టు చైతన్యాన్ని పెంపొందించడమే లక్ష్యమని లక్ష్మి నర్సయ్య తెలిపారు.