నవతెలంగాణ-పెద్దవూర: సోమవారం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గెలుపు కోసం నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి ఆదేశాల మేరకు యూసుఫ్ గూడ 272 డివిజన్ లో గడపగడపకు వెళ్లి మండల యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం, రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లు, మరెన్నో సంక్షేమ పథకాలు వంటివి వివరిస్తూ ప ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ గుండెబోయిన లక్ష్మణ్ యాదవ్,సతీష్ గౌడ్, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మేకల శ్రీకాంత్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేపాకుల సాయి కుమార్,సోషల్ మీడియా కోఆర్డినేటర్ మద్దాల భాను తదితరులు పాల్గొన్నారు.



