సన్మానించిన ఉపాధ్యాయులు
నవతెలంగాణ – మిర్యాలగూడ
మిర్యాలగూడ మండల విద్యాధికారి ఉట్లపల్లి ఉన్నత పాఠశాల గజ్జేటేడ్ ప్రధానోపాధ్యాయులు రామవత్ మాంగ్య నాయక్ శనివారం స్థానిక మండల వనరుల కేంద్రంలో భాద్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిర్యాలగూడ మండలంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు.మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య విద్యార్దులకు అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.
ప్రజలు ప్రభుత్వ పాఠశాలలను ఆదరించాలని,పిల్లలను ప్రభుత్వ బడులలో చేర్పించాలని కోరారు. అనంతరం ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సీనియర్ ఉపాధ్యాయులు, వివిధ సంఘాల నాయకులు మండల విద్యాధికారినీ శాలువ, పూల దండతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మంగళ, ధర్మ నాయక్, కరుణాకర్ రెడ్డి, భిక్షపతి, రాజు, బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణా రాష్ట్ర కన్వీనర్ దశరథ్ నాయక్, గుడిపాటి కోటి తదితరులు పాల్గొన్నారు.



