నవతెలంగాణ – సిద్ధిపేట పీవీ నరసింహారావు ప్రేరణతో మన్మోహన్ సింగ్ రాజకీయాల్లోకి వచ్చారని, ఇప్పుడు ఆయన పేరిట ప్రారంభమైన ఈ ఫెలోషిప్, ప్రజాసేవకు ఒక బలమైన వేదికగా మారనుందని ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ నేషనల్ లీడర్స్ నవిక హర్షిని, ఆదిత్య రెడ్డి అన్నారు. టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫెలోషిప్ కర పత్రం ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..ప్రజా సేవలోకి రావాలనుకునే ప్రొఫెషనల్స్‌కు ఇది ఒక గొప్ప అవకాశమని, టీపీసీసీ తరఫున ఈ ప్రొజెక్ట్‌ను చేపట్టిన ఏఐపిసి నాయకులకి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇర్ఫాన్ అజీజ్ , తుమ్మల సందీప్, భూషణ్, రాఘవేంద్ర, సంతోష్ ,సుబ్బారావు, మెండు శ్రీనివాసులు, రణధీర్, భరత్ రెడ్డి పాల్గొన్నారు.
మన్మోహన్ సింగ్ ఫెలోషిప్ కరపత్రం ఆవిష్కరణ..
- Advertisement -
- Advertisement -