Thursday, January 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండల అధికారులను కలిసిన మంతూర్ పాలకవర్గం

మండల అధికారులను కలిసిన మంతూర్ పాలకవర్గం

- Advertisement -

నవతెలంగాణ- రాయపోల్ 
రాయపోల్ తహసిల్దార్ కృష్ణమోహన్, ఎంపీడీవో శ్రీనివాస్ లను మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి చిరు సత్కారం చేయడం జరిగిందని మంతూర్ సర్పంచ్ మహమ్మద్స్ పర్వేజ్ తెలిపారు. మంగళవారం రాయపోల్ మండల కేంద్రంలో తహసిల్దార్ ఎంపీడీవో కార్యాలయాలలో మండల స్థాయి అధికారులను కలిసి గ్రామ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయపోల్ మండలం మంతూర్  గ్రామంలో నెలకొన్న సమస్యల పారిశుద్ధ్యం,డ్రైనేజీ, విద్యుత్ దీపాలు, మంచినీటి వసతి, ఉపాధి హామీ పనులు, ఇతర సమస్యలతో పాటు అభివృద్ధి పనుల గురించి చర్చించడం జరిగిందన్నారు.

అలాగే గ్రామములో ఉన్న భూ సమస్యలపై తహసీల్దారుతో చర్చించడం జరిగిందన్నారు. గ్రామ అభివృద్ధికి సహకరించాలని అధికారులు ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా సమన్వయంతో పనిచేస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బంధారం సంతోష్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు భాగరెడ్డి,వార్డు సభ్యులు పడిగే రవీందర్,. దయ్యలా పోచయ్య, నాయకులు ఎల్లయ్య,మన్నే చిరంజీవి, పడిగే మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -