Saturday, September 27, 2025
E-PAPER
Homeక్రైమ్ఏసీబీ వలలో మణుగూరు ఎస్‌ఐ

ఏసీబీ వలలో మణుగూరు ఎస్‌ఐ

- Advertisement -

ఆడియో, వీడియో రికార్డుల ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌
నవతెలంగాణ-మణుగూరు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ బత్తిని రంజిత్‌ కుమార్‌ను ఏసీబీ అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఖమ్మం ఇన్‌చార్జి ఏసీబీ డీఎస్పీ విజరు కుమార్‌ విలేకరులతో మాట్లాడారు. స్టేషన్‌ బెయిల్‌ మంజూరు కోసం రూ.40 వేలు లంచం అడిగాడని, రెండు ఆడియో, ఒక వీడియో క్లిప్పింగ్‌ ద్వారా డబ్బులు డిమాండ్‌ చేసిన ఆధారాల ప్రకారం సెక్షన్‌ 7డీ కింద కేసు నమోదు చేసి, కస్టడీలోకి తీసుకున్నామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఖమ్మం ఏసీబీ సీఐ శేఖర్‌, సీఐ కృష్ణకుమార్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -