- Advertisement -
రెటీనాలో బంధింపబడ్డ దృశ్యం
మనసు అట్టడుగు పొరల్లో చేదుగా
గిరికీలు కొడుతూనే ఉంది
ఊరవతల నక్క ఊళ
భయానక మార్చురీని తలపిస్తోంది
ఆకాశాన మొలిచిన చంద్రవంక
ఒంటరిగా నేలను చూస్తోంది
ఎర్రటి నది చరిత్రను పిల్లలకు
పాఠాలుగా చెబుతోంది
సైనిక గుడారం కాలిపోయిందనే వార్తతో
దేశపౌరులందరూ విషాదాశ్రువులు కురిపించారు
దేహాన్ని అతుక్కున్న పరధ్యానమొకటి
రాలిపోవడం లేదు
మరిగి మరిగి చిక్కనై
మరింత చేరువౌవుతోంది
- రాధ తాళ్లూరి
- Advertisement -

