నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని భద్రా గ్రామంలో యూత్ కాంగ్రెస్ నాయకుడు కొల్లు శ్రీనివాసరెడ్డి తండ్రి బిక్షం రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా గురువారం మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి శ్రీనివాసరెడ్డిని పరామర్శించారు. కొల్లు బిక్షం రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. శ్రీనాథ్ రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు ములుగు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మద్దాలి నాగమణి,మండల యూత్ అధ్యక్షులు చింత క్రాంతి, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గొంది కిరణ్,మహిళా కాంగ్రెస్ నాయకులు సునీత,వసంత, కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరయాల యాదగిరి,వాసం శ్రావణ్,చేరుకుల సురేష్ మరియు తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు .
శ్రీనివాసరెడ్డి పరామర్శించిన మార్కెట్ కమిటీ చైర్మన్ కళ్యాణి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES