Saturday, March 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సామూహిక సిమంతాలు 

ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సామూహిక సిమంతాలు 

- Advertisement -

నవతెలంగాణ – దర్పల్లి
మండలంలోని రామడుగు గ్రామములో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఓ అంగన్వాడీ కేంద్రంలో గర్భవతులకు సామూహిక సీమంతాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ గారు శ్రీ. పార్వతీ రమేష్ గౌడ్, ఉప సర్పంచ్ లోలం రాజేశ్వర్లు హాజరయ్యారు. గ్రామంలోని ప్రతి గర్భిణీ ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లి అక్కడ ఇచ్చే ఒక్కపూట సంపూర్ణ భోజనం తప్పకుండా తీసుకోవాలని తెలియజేశారు.

అలాగే భోజనం తర్వాత ఐరన్ ఫో లీక్ యాసిడ్ మాత్రలు వేసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలలో మెనూ ప్రకారంగా వండే భోజనంలో పోషకాహారం ఎంతో ఉంటుందని దానిని ప్రతి ఒక్క గర్భవతి ,బాలింత వినియోగించుకోవాలని తెలిపారు.

అనంతరం ఐసిడిఎస్ సూపర్వైజర్ సరిత మాట్లాడుతూ.. మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలందరినీ తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని కోరారు. నూతన జాతీయ విద్యా విధానం ప్రకారంగా అంగన్వాడీ కేంద్రాలలో నాణ్యమైన విద్యను బోధిస్తారని తల్లిదండ్రులకు తెలిపారు. ప్రతి నెల అంగన్వాడీ కేంద్రంలో రెండు రకాల కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్లు జరుపుతూ అవగాహన కార్యక్రమాలను కల్పించడం జరుగుతుంది అని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ టీ. గోదావరి వార్డు మెంబర్లు, గ్రామంలోని లబ్ధిదారులు మరియు తల్లులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -